Site icon NTV Telugu

Komatireddy Rajgopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా..

Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

MLA Komatireddy Rajgopal Reddy Resign To Congress Party.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్‌ నుంచి ఓ ముఖ్య నేత వెళ్లిపోతున్నారంటే.. ఖచ్చితంగా ఆ ప్రభావం కాంగ్రెస్‌ పార్టీపై పడుతుందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటికే అధిష్టానం రాజగోపాల్‌ రెడ్డిని పార్టీ వీడివెళ్లకుండా ఉండేందుకు సీనియర్‌ నాయకులతో మంతనాలు జరిపినా అవి విఫలమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీలో తనకు అవమానం జరిగిందని.. నేను ఇక కాంగ్రెస్‌ పార్టీలో ఉండటం కుదరదని.. పార్టీ వీడుతున్నట్లు భీష్మించుకుని కూర్చున్నారు రాజగోపాల్‌ రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని, కొన్ని రోజులు సమయం తీసుకుని నిర్ణయం తీసుకుందామని అనుకున్న. ఇప్పుడున్న ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తె అక్కడే నిధులు ఇస్తున్నారు.

 

చర్చ పక్కదారి పడుతుంది. కొందరు నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కువ సమయం వేచి చూడటం కంటే త్వరగా నిర్ణయం తీసుకోండి అని మా నాయకులు చెప్పారు. నానూస్తు పోతే మంచిది కాదని నిర్ణయం తీసుకున్న. పోడు భూముల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్న.. ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు. మూడున్నర ఏండ్లుగా ఏమి అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడ లేదు. టీఆర్‌ఎస్‌కి 90 సీట్లు ఇచ్చినా ప్రజల సమస్య పట్టలేదు. భట్టి దళిత నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఉండనివ్వలేదు. 12 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు బాధ అనిపించింది. వెళ్లడం తప్పే..తీసుకోవడం తప్ప. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అప్పాయింట్ మెంట్ లేదు. డిండి ప్రాజెక్ట్ .. ముందుకు పోదు. కాళేశ్వరం మాత్రం పూర్తి అయ్యింది. జిల్లాకు కేసీఆర్‌ చేసింది ఏం లేదు. అంటూ రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Exit mobile version