ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎమ్మె్ల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కామినేని శ్రీనివాస్ను రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ, జి. మధుకర్, వేటుకూరి సూర్యనారాయణ రాజు శాలువ కప్పి సత్కరించారు. ఈ క్రమంలో.. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు ఇచ్చిన ప్రజావిజయం అని అన్నారు. ఏపీకి రాజధాని లేదు.. అది ఏపీ చేసుకున్న దురదృష్టమని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు మార్చినా అడిగే వాళ్ళు లేరని ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆరా మస్తాన్ లాంటి వాళ్ళను నమ్మి లక్షల మంది కోట్ల రూపాయలు పోగొట్టారని తెలిపారు.
Read Also: Pawan Kalyan: ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుంటా.. ఎందుకంటే..?
గతంలో మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అది అధిష్టానం నిర్ణయం అని చెప్పుకొచ్చారాయన. రాబోయే రోజుల్లో టీడీపీ ఉన్నంత కాలం బీజేపీతో ఉంటానని చంద్రబాబు అన్నారని కామినేని తెలిపారు. చంద్రబాబు, పవన్, మోడీలది పబ్లిక్ ఎజెండా అని పేర్కొన్నారు. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపించాలి.. 2018 మరల రిపీట్ కాదని అస్యూరెన్స్ ఇస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్నారు.. తన నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందని.. కేంద్ర జలజీవన్ మిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు మంచినీరు ఇస్తామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Pawan Kalyan: అధికారంలో భాగస్వామ్యం.. పవన్ కీలక వ్యాఖ్యలు