Site icon NTV Telugu

Kaleru Venkatesh: కాలేరు వెంకటేష్ కు ఆపూర్వ స్వాగతం.. అంబర్ పేటలో గెలిచేది బీఆర్ఎస్సే

Kaleru

Kaleru

అంబర్ పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు స్థానిక మహిళలు ఆపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో చినుకు పడితే వీధులన్నీ జలమయమయి ఇళ్లలోకి వరద నీరు ప్రవహించే పరిస్థితి నుంచి అంబర్ పేటలో అద్భుతమైన నాళాల పునరుద్ధరణ చేపట్టి రోడ్లను విస్తరించి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశామని ఈ అభివృద్ధిని చూసి ప్రజల నుండి చక్కని ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

ఇక, పటేల్ నగర్ లోని బుజులి మహంకాళి ఆలయంలో అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు కార్యకర్తలు మహిళలతో కలిసి పటేల్ నగర్ లో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. అంబర్ పేట లో గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, గడపగడపకు అందిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టనున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి తెలియ పరుస్తున్నామన్నారు.

Read Also: Congress: నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి మార్పు

అయితే, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. దీంతో ఈ మరోసారి అంబర్ పేటలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version