తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ నేతలతో విమర్శలకు ప్రతివిమర్శలు ఘాటుగానే సాగుతున్నాయి. అయితే.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పంఇస్తూ.. ఇద్దరు ఎంపీలు పార్టీ మారతారు అని కేటీఆర్ చెప్పడం దుర్మార్గమన్నారు.
ఉన్నదే ముగ్గురు ఎంపీలు అని, ఇందులో ఒకరు పీసీసీ చీఫ్.. ఇంకొకరు మాజీ పీసీసీ.. ఇంకో ఎంపీ ఎప్పుడో ఓ రోజు పీసీసీ కావాలని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో పార్టీ మారేదీ ఎవరూ..? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మాటలకు విలువ పెంచిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వక పోతే కేటీఆర్‌కి ఈ హోదాలు వచ్చేవా..? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ పుట్టుకతో కింగ్ అని, కేటీఆర్ మిడిల్ ఏజ్ కింగ్ అని జగ్గారెడ్డి విమర్శించారు.