Site icon NTV Telugu

Harish Rao: ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది..

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో ప్రమాదం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ప్రమాద బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యారు.. వరుస సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.. ప్రమాదంలో గాయపడ్డ వారిని గాలికి వదిలేశారు అని హరీష్ రావు అన్నారు.

Read Also: Ramayana – Ranbir Kapoor: వైరల్ గా మారిన రణబీర్ కపూర్ ‘రామాయణ’ సెట్స్ పిక్స్..!

బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెరుగైన వైద్యం అందిచేలేలా చూడాలి.. గాయపడిన వారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించాలి.. ప్రమాదం గురించి, క్షతగాత్రులు సరైన సమాచారం లేదు.. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టీ తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చనిపోయిన వారికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 25 లక్షల రూపాయల సహాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అని ఆయన అన్నారు. సహాయక చర్యలు కుడా సరిగ్గా చేయలేదు.. బీఆర్ ఎస్ పార్టీ తరపున చనిపోయిన వారికి, గాయపడిన వారికి సహాయం చేస్తాము అని హరీష్ రావు వెల్లడించారు.

Exit mobile version