MLA Gorantla Butchaiah Chowdary on Villages Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాల రూపకల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు అడుగులు వేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవని గోరంట్ల బుచ్చయ్య చెప్పారు.
Also Read: CM Chandrababu: ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… ‘గంగా కాలుష్య నివారణ పథకం మాదిరిగానే.. గోదావరి కాలుష్య నివారణ పథకాన్ని అమలు చేయాలి. కేంద్రం సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. గత ప్రభుత్వంలో నిధులను దారి మళ్లించి గ్రామపంచాయతీలను నిర్వీర్యం చేశారు. దీని ఫలితంగా చాలా గ్రామాలు అతిగతి లేకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. నిధులు లేమితో వీధిలైట్లు, పైపులైన్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవు. కూటమి ప్రభుత్వం రావడంతో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదల, స్వచ్ఛమైన త్రాగునీరు సదుపాయాలు కల్పనకు ప్రభుత్వ నడుం బిగిస్తుంది’ అని అన్నారు.