కాంగ్రెస్ నేతలు చేసేది పాదయాత్రలు కాదు.. పాడేలు కట్టే యాత్రలు అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఏ చట్టం పెట్టిందే రేవంత్ రెడ్డి కోసం అన్నట్లు వాడుకున్నారని ఆయన సెటైర్లు వేశారు. 119 మంది నియోజకవర్గాల్లో అందరూ దొంగలే అన్నట్లు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని గాదరి కిషోర్ మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అని పెట్టుకుంటే బెటర్ అని, రాజకీయ వ్యభిచారి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Nandamuri Sisters: నందమూరి ఆడపడుచులను ఇలా ఎప్పుడైనా చూశారా..?
అమరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుందని ఆయన అన్నారు. నిర్మాణాల అంచనాలు, బడ్జెట్ ఎందుకు పెరిగిందో ఆర్టీఏ వేసుకోని తెలుసుకోవాలని, అది రేవంత్ రెడ్డికి తెలిసిన విద్యే కదా అంటూ చురకలు అంటించారు. అమరుల త్యాగాల పుణ్యంతో తెలంగాణ వచ్చిందని తెలువడానికి సెక్రటేరియట్ ముందు అమరుల స్థూపమని, సెక్రటేరియట్ వచ్చినప్పుడల్లా అది గుర్తుకు రావాలనే దాని ఉద్దేశమన్నారు. అమరుల స్థూపం వద్ద రాహుల్ గాంధీతో దండం పెట్టించారా రేవంత్ రెడ్డి? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని ఆయన హెచ్చరించారు.
Also Read : Bandi sanjay: 15న రాలేను కానీ.. ఎందుకు హాజరు కావాలో వివరణ ఇవ్వండి..