NTV Telugu Site icon

MLA Anil Yadav : వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. అనవసరంగా ఆరోపణలు చేయడం తగదు

Anil Kumar Yadav

Anil Kumar Yadav

ఏపీలో మరోసారి రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. టీడీపీ నేత కోటంరెడ్డిపై జరిగిన దాడితో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. ఈ దాడిపై తాజాగా మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో ఏమి జరిగినా నాకు అంట గడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేత కోటంరెడ్డి పై జరిగిన దాడి వ్యక్తిగతమని టీడీపీ నేతలు సోమిరెడ్డి ..అబ్దుల్ అజీజ్ లు చెప్పారన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్, చంద్రబాబులు మాత్రం తన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :Woman Drink Blood : అబ్బా ఎంత ఘోరం… బాలుడిని చంపి రక్తం తాగి.. ముఖానికి పూసుకుని

అచ్చెన్నాయుడు మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటే బీసీలపై దాడి అంటారని, నేను బీసీ మాజీ మంత్రిని కాదా… అని ఆయన ప్రశ్నించారు. కారుతో దాడి చేసిన రాజశేఖర్ రెడ్డి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదని, ఆయనకు కోటంరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య ఏదో వివాదం ఉందని ఆయన వ్యా్ఖ్యానించారు. అందువల్లే ఈ ఘటన జరిగిందని, పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయరన్నారు. అప్పటివరకూ అనవసరంగా ఆరోపణలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. సాయంత్రం ఐదు గంటలకే రాజశేఖర్ రెడ్డి కోటంరెడ్డి ఇంటికి వచ్చాడని, అప్పుడే ఇరు వర్గాల మధ్య వివాదం జరిగిందన్నారు. అప్పుడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.