Site icon NTV Telugu

Anil Kumar: మాజీ మంత్రి నారాయణ పై ఎమ్మెల్యే అనిల్ విమర్శనాస్త్రాలు..

Anil

Anil

Anil Kumar: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేతల మధ్య పోరు చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నారాయణపై అనిల్ విరుచుకుపడ్డారు. నెల్లూరు నగరంలో ఏ బిల్డర్ లేదా, వ్యాపారినైనా గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి.. అనిల్ నుంచి ఫోన్ వచ్చిందని. వ్యాపారస్తులను ఏనాడు తాను ఇబ్బంది పెట్టలేదని అనిల్ చెప్పారు.

Read Also: Nara Lokesh: ఏసీబీ కోర్టులో నారా లోకేష్ పిటిషన్ పై విచారణ..

కరోనా, వరదల కాలంలో నారాయణ ఎక్కడున్నారని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇప్పుడు నేనున్నా.. నేనున్నా అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సున్నా చుడతారని విమర్శించారు. మరోవైపు.. నారాయణ మెడికల్ కళాశాలలో ఐదుగురు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ ప్రాంతంలో ఉన్నా.. ఆయన పరామర్శించలేదన్నారు. రాష్ట్రంలో ఇతర కళాశాలలతో పోలిస్తే.. నారాయణ కళాశాలలోనే ఎందుకు చనిపోతున్నారో సమాధానం చెప్పాలని కోరారు. కక్ష సాధింపు గురించి నారాయణ మాట్లాడటం సరికాదు.. టీడీపీ హయంలో తనపై బురద చల్లారే కానీ.. కనీసం కేసు కూడా పెట్టలేకపోయారని అనిల్ తెలిపారు.

Read Also: Lakshadweep vs Maldives: మాల్దీవులు, లక్షద్వీప్ మధ్య తేడా, ఏది ఎంత ప్రత్యేకం?

Exit mobile version