AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకులాల ప్రభంజనం.. 97 శాతం ఉత్తీర్ణత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు.. 12 ఏళ్ల రికార్డులు బ్రేక్ అయ్యాయి.. అయితే, ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకుల విద్యాసంస్థలు అద్భుత ప్రతిభ కనబరిచారు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థులు 97 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఇంటర్లో 94 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.. దీనిపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సవిత.. ఈ ఫలితాలు బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
Read Also: AP Government: అమరావతిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ‘Thi’ కాదు.. ‘Ti’ ఉండాల్సిందే..
Also Read
- Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- CM Chandrababu: సింగపూర్లో 'సీబీఎన్@361 డిగ్రీస్' పుస్తకావిష్కరణ!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
మంత్రి సవిత వెల్లడించిన వివరాల ప్రకారం, ఎంజేపీ గురుకులాలకు చెందిన విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఇంటర్లో 94 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ ఫలితాలు బీసీ గురుకుల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. అలాగే ఈ విజయానికి కారణమైన గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫలితాల సాధనలో ఎంజేపీ గురుకులాల సిబ్బంది పనితీరు అమోఘమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే బీసీ గురుకులాల అభివృద్ధికి కొత్త దిశ లభించిందని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీ గురుకులాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించిందని చెప్పారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తూ సమగ్ర విద్యను అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ బిడ్డలు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా కూటమి ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందని ఆమె తెలిపారు. ఎంజేపీ గురుకులాల విద్యార్థులు సాధించిన ఈ విజయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనంద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?