Mithun Manhas: మిథున్ మన్హాస్ BCCI కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మొదట తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ నియామక వార్తను పంచుకున్నారు. మిథున్ మన్హాస్ అధికారికంగా BCCI అధ్యక్షుడిగా నియమితులైనట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్ అధికారికంగా నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీ తర్వాత వరుసగా ఈ పదవిని చేపట్టిన మూడవ క్రికెటర్ గా నిలిచారు. 45 ఏళ్ల మన్హాస్ గతంలో జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆయనతో పాటు, క్రికెట్ పరిపాలన, వ్యూహాత్మక ప్రణాళిక రెండింటిలోనూ అపారమైన అనుభవాన్ని తెచ్చిన రాజీవ్ శుక్లాను ఉపాధ్యక్షుడిగా ప్రకటించారు. దేవజిత్ సైకియా గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రభతేజ్ సింగ్ భాటియా జాయింట్ సెక్రటరీ పాత్రను చేపట్టారు.
READ MORE: Israel Attack Pakistan: ఇజ్రాయెల్ దాడితో గజగజలాడిన పాక్.. తర్వాత ఏం జరిగిందంటే..
మిథున్ మన్హాస్ 1979 అక్టోబర్ 12న జమ్మూ కశ్మీర్‌లో జన్మించారు. 1997-98లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 9714 పరుగులు చేశారు. 27 సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు సాధించారు. అతను 130 లిస్ట్-ఎ మ్యాచ్‌లలోనూ 4126 పరుగులు చేశారు. ఇందులోనూ 5 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు సాధించారు. 91 T20 మ్యాచ్‌లలో 1170 పరుగులు చేశారు. బౌలర్‌గా 70 వికెట్లు కూడా పడగొట్టారు. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్, పూణే వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 55 మ్యాచ్‌లలో 514 పరుగులు చేశారు.
