Site icon NTV Telugu

Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్‌ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?

Mitchell Starc Ball

Mitchell Starc Ball

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ఆసీస్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోగా.. భారత్‌ స్కోరు 11.5 ఓవర్లకు 37/3గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ (6), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. అయితే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Hyderabad Metro Scare: మూసాపేట మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం!

భారత్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్‌ మొదటి ఓవర్ ఓవర్ వేయగా.. రోహిత్ శర్మ స్ట్రైకింగ్ చేశాడు. రోహిత్‌కు సంధించిన మొదటి బంతి స్పీడ్‌ గన్‌లో 176.5 కిమీలు చూపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెలిసి క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే స్పీడ్‌ గన్‌లో పొరపాటుగా 176.5 కిమీలు నమోదైనట్లు సమాచారం. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతి 161.3 కిమీలు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిమీ వేగంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ బంతిని సంధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన నిక్ నైట్‌ ఆ బంతిని ఎదుర్కొన్నాడు.

Exit mobile version