Mission Chapter 1 : ఓటీటీలోకి వచ్చేస్తున్న అమీ జాక్సన్ రీఎంట్రీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రామ్‌చరణ్ ఎవడు మూవీలో గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ తన ప్రేమ వ్యవహారంతో పాటు తల్లిగా మారిన అమీజాక్సన్ ఆరేళ్ల పాటు సినిమాలకు దూరమైంది.హీరోయిన్‌గా అమీ జాక్సన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన కోలీవుడ్ మూవీ మిషన్ చాఫ్టర్ వన్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ యాక్షన్ మూవీలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది.తమిళంతో పాటు తెలుగులో కూడా సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. కానీ తెలుగులో సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కావడంతో థియేటర్ల సమస్య కారణంగా మిషన్ చాఫ్టర్ వన్ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మిషన్ ఛాప్టర్ వన్ మూవీని నిర్మించింది.
ఇదిలా ఉంటే మిషన్ ఛాప్టర్ వన్ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మార్చి 1న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో మిషన్ ఛాప్టర్ వన్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగులో ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. తమిళ వెర్షన్ రిలీజైన వారం రోజుల తర్వాత తెలుగులో రిలీజ్ చేయాలని అయితే అనుకున్నారు. కానీ తమిళ వెర్షన్ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలవడంతో తెలుగు రిలీజ్‌పై ఎఫెక్ట్ పడింది. దాంతో నేరుగా మిషన్ ఛాప్టర్ వన్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకే రాబోతోంది.తండ్రి కూతుళ్ల ఎమోషన్‌కు యాక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు ఏఎల్ విజయ్ మిషన్ ఛాప్టర్ 1 మూవీను తెరకెక్కించాడు. హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోన్న తన కూతురుని కలుసుకోవడానికి జైలులో ఉన్న ఖైదీ ఎలాంటి పోరాటం చేశాడు.. విదేశీ జైలులో అతడు ఖైదీగా మారడానికి కారణం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ. ఇందులో అమీజాక్సన్ పోలీస్ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమాలో అమీజాక్సన్‌తో పాటు నిమిషా సజయన్ మరో హీరోయిన్‌గా కనిపించింది.
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
తాజావార్తలు
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్‌తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
-
Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!