Boy Found In Alligator’s Mouth : అమెరికాలో ఘోరం జరిగింది. ఓ వైపు తండ్రి చేతిలో తల్లి హత్యకు గురికావడం, కొన్ని గంటల్లోనే వారి బాలుడు మొసలి నోటిలో విగతజీవిగా లభ్యం కావడం స్థానికులను కలచి వేసింది. ఆచూకీ లేకుండా పోయిన ఓ రెండేళ్ల చిన్నారి మొసలి నోటిలో శవమై కనిపించిన ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన పషున్ జెఫ్ఫెరీ అనే మహిళ తన అపార్టుమెంటులోనే మార్చి 30న దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని.. ఆమె శరీరంపై భారీ కత్తిపోట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే వారు ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. అపార్టుమెంటులో జెఫ్ఫెరీ మృతదేహం ఒకటే కనిపించింది. ఆమె రెండేళ్ల కుమారుడు టేలన్ మోస్లీ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో సెయింట్ పీటర్స్‌బర్గ్ పోలీసులు బాలుడి కోసం ముమ్మరంగా వెతుకులాట ప్రారంభించారు.
Read Also: Income Tax : ITR ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్త.. చిన్న తప్పుకు రూ.5వేల ఫైన్
ఆ అపార్టుమెంటుకు సమీపంలోని ఉన్న డెల్‌హోమ్స్ పార్కులోని కొలనులో వెతికారు. చివరకు కొలను సమీపంలో ఉన్న మొసలి నోటిలో ఏదో వస్తువును పోలీసులు గుర్తించారు. దానిపై తుపాకీతో ఓ రౌండు కాల్పులు జరపడంతో మొసలి నోటిలో ఉన్న వస్తువును విడిచిపెట్టేందుకు ప్రయత్నించింది. బాలుడు శరీరం మాదిరిగా కనిపించడంతో మొసలిని చంపి దాన్ని బయటకు తీశారు. అది తప్పిపోయిన బాలుడిదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు.. అతడు మొసలికి ఎలా బలయ్యాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
Read Also:Off The Record: తీర్మానం ఆ నేతల కొంపముంచుతుందా?
జెఫ్ఫెరీతోపాటు బాలుడి మృతికి అమె భర్త థామస్ మోస్లీనే కారణమని భావించిన పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరిచారు. ఇది ఇంతటి విషాదంతో ముగుస్తుందని అనుకోలేదని సెయింట్ పీటర్‌బర్గ్ పోలీసు చీఫ్ ఆంటోనీ హాలోవే వెల్లడించారు.