హైదరాబాద్ లో గత కొంత కాలం నుంచి వరుసగా బాలికలు, యువతుల మిస్సింగ్ కలకలంగా మారుతోంది. అయితే హైదరాబాద్‌లో వరుస మిస్సింగ్ ఘటనలతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. ఇవి మరువక ముందే తాజాగా మరో ఇద్దరు యువతులు మిస్సింగ్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోయారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధులలో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది.
Also Read : CP CV Anand : పోలీసులు ఫిట్‌నెస్‌పైన శ్రద్ధ వహించాలి.. అందుకే పిటీ కాప్ అనే ప్రోగ్రాం
కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసే జ్యోతి, కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బి.కాం చదువుతున్న లిఖిత రమ్య అనే ఇద్దరి అదృశ్యమయ్యారు. ఇంటర్ చదువుతున్న సమయం నుండి జ్యోతి, రమ్యలు స్నేహితులు. అయితే.. వారు గురించి తెలిసిన వారివద్ద, బంధువుల వద్ద వెతికినా అచూకీ దొరకకపోవడంతో.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
Also Read : Pawan Kalyan: జనసేన సభ సక్సెస్.. విజయవంతం చేసిన వారికి థ్యాంక్స్
