Site icon NTV Telugu

Miss Sri lanka: మిస్ శ్రీలంక పోటీల్లో ఘర్షణ… పిడిగుద్దులు గుద్దుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు

Miss Sri Lanka

Miss Sri Lanka

Miss Sri lanka: అమెరికాలో న్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో జరిగిన మిస్‌ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. దాదాపు 300 మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు హోరాహోరీగా తగవులాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఈ గొడవకు కారణమేంటని స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనలో అక్కడి ఫర్నీచర్‌ డ్యామేజ్‌ అయింది. ఈ గొడవలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అందాల పోటీల్లో పాల్గొన్న 14 మంది కంటెస్టెంట్లు ఎవరూ ఈ గొడవకు దిగలేదని మిస్‌ శ్రీలంక నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది మిస్‌ శ్రీలంక కిరీటాన్ని ఏంజెలియా గుణశేఖర కైవసం చేసుకుంది.

MLA Koneru Konappa: అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్..

న్యూయార్క్‌లోని స్టేటన్‌ ఐల్యాండ్‌లో ఎక్కువగా లంకేయులు నివసిస్తుండటం వల్ల ఈ ప్రాంతాన్ని పోటీలకు వేదికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో స్టేట్‌ ఐలాండ్‌లో మిస్‌ శ్రీలంక పోటీలను నిర్వహించారు. పోటీల ద్వారా సేకరించిన నిధులలో శ్రీలంకలోని క్యాన్సర్‌ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో లంకవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గొడవపడుతూ అమెరికాలో లంక పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు.

 

Exit mobile version