Site icon NTV Telugu

Goldy Brar: మూసేవాలా హత్య కేసులో నిందితుడి మృతిపై అమెరికా కీలక ప్రకటన

Diee

Diee

పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడు గోల్డీబ్రార్‌ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా కొట్టిపారేసింది. కెనడాకు చెందిన గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తెలిపారు. భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అమెరికా పోలీసులు ఖండించారు.

మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్‌ కాదని లెఫ్టినెంట్‌ విలియం జే డూలే వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్‌ గాల్డ్నె అని వెల్లడించారు. గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. ఇతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధూ మూసేవాల హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది.

ఇది కూడా చదవండి: Monditoka Jaganmohan Rao: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే నడిపిస్తున్నారు..

మరోవైపు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్‌ పేరు వినిపించింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో ఒకరు బుధవారం పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్న అనూజ్‌ తపన్‌ అనే వ్యక్తిని గత నెల 26న పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అతడు లాకప్‌ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్డి నుంచి అనూజ్‌ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Gold Price Today : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను మే 29, 2022న హత్య చేశారు. దీంతో ఒక్కసారిగా గోల్డీ బ్రార్ పేరు ప్రచారంలోకి వచ్చింది. బ్రార్ మార్గనిర్దేశంతోనే మూసేవాలా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ అసలు పేరు సతీందర్‌జీత్ సింగ్. ఇతను పంజాబ్ డిపార్ట్మెంట్‌లో పనిచేసిన మాజీ పోలీస్ కుమారుడు. పంజాబ్‌లోని స్థానిక గ్యాంగ్‌లతో కలిసి పనిచేసి, తన నేర చరిత్రను ప్రారంభించారు. పెద్ద పెద్ద నేరాలు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత కెనడా పారిపోయాడు. హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా చేయడం వంటి నేరాల్లో పాల్గొన్న కారణంగా కెనడా ఇతడిని మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Uma Ramanan Dies: ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత!

Exit mobile version