Site icon NTV Telugu

Mirzapur 3:’మీర్జాపూర్‌ సీజన్ 3′ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Whatsapp Image 2024 01 17 At 4.12.47 Pm

Whatsapp Image 2024 01 17 At 4.12.47 Pm

ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించిన సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జా పూర్‌. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ మూడో సీజన్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది.చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ 3 ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌ మరియు డబ్బింగ్‌ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మీర్జా పూర్‌ సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్‌ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నగరం నేపథ్యంలో క్రైమ్‌ అండ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా మీర్జా పూర్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఈ సిరీస్ లో పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌ మరియు హర్షిత గౌర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

2018 నవంబరు 16న మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ రిలీజ్‌ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ అందుకుంది.. ఇండియాలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇక దానికి సీక్వెల్ గా 2020 అక్టోబరు 23న మీర్జాపూర్‌ రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఇది మొదటి పార్ట్‌కు మించి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. దీంతో మీర్జాపూర్‌ మూడో సీజన్‌ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే మీర్జాపూర్‌ సిరీస్‌ ఎంత పెద్ద హిట్ అయిందో అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా అంతే పాపులర్ అయ్యాయి .ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మరియు బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే ఈ సిరీస్ లో ఎక్కువగా హింస, రొమాన్స్‌ తో కూడిన సన్నివేశాలు ఉండడం మీర్జాపూర్‌ సిరీస్‌లో ప్రతికూలాంశంగా చెప్పొచ్చు. ఇక మొదటి సీజన్‌లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ మరియు భార్య శ్వేతలను కోల్పోతాడు.అదే రెండో సీజన్‌ లో మున్నాపై గుడ్డూ ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడో చూపించారు.ఇక మూడో పార్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది

Exit mobile version