NTV Telugu Site icon

Mirnalini Ravi : విజయ్ ఆంటోనీ రొమాన్స్ బాగా చేసారు..

Whatsapp Image 2024 03 17 At 7.34.33 Am

Whatsapp Image 2024 03 17 At 7.34.33 Am

యాక్షన్ రోల్స్ లో ఎక్కువగా అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్ గా అలరించబోతున్నాడు.. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించాడు. కానీ మొదటి సారి ‘లవ్ గురు’లో లవర్ బాయ్ గా మెప్పించనున్నాడు.. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం  ప్రమోషన్స్ మొదలు పెట్టింది.ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్మీట్ నిర్వహించి మూవీ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాళిని మాట్లాడుతూ.. ఎప్పుడు సీరియస్ గా కనిపించిన విజయ్ ఆంటోని గారిని ఈ చిత్రంలో సరికొత్తగా చూడబోతున్నారన్నారు.

ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారంటూ విజయ్ ఆంటోనిపై సరదా కామెంట్స్ చేశారు. “విజయ్ ఆంటోనీని ఇప్పటివరకు సీరియస్ గా చూశారు. లవ్ గురులో మీరు సరికొత్త విజయ్ ఆంటోనిని చూడబోతున్నారు. మొదటిసారి ఆయన రొమాంటిక్ గా కనిపించబోతున్నారు.  ఈ సినిమాలో ఆయన రొమాన్స్ బాగా చేశారు. ఈ మూవీ తర్వాత ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అంతేకాదు లవ్, రొమాంటిక్ స్క్రిప్ట్స్ ఆయనకు క్యూ కట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.ఇక షూటింగ్ టైమ్ లో ఆయనను నేను లవ్ గురులా భావించి సలహాలు తీసుకునేదాన్ని. సెట్లో నా బ్రేకప్ స్టోరీస్ ఆయనకు సరదాగా చెప్పేదాన్ని. ఇలా విజయ్ గారితో షూటింగ్ మొత్తం ఫన్ గా సాగింది. లీలాగా నా పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాత్ర కోసం నేను కలైరాణి మేడం దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాను. తన సలహాలు, సూచనలు నాకు బాగా ఉపయోగపడ్డాయి” అని చెప్పుకొచ్చారు.

Show comments