Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mirchi Bajji Recipe: సాయంత్రం పూట వేడి వేడి టీతో పాటు ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు, కేవలం 10-15 నిమిషాలలో ఈ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీని సిద్ధం చేసుకోవచ్చు.సాధారణంగా ఇంట్లో చేసే బజ్జీలు మెత్తగా అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు చెప్పినట్లుగా పిండిని కలిపి, వేడి నూనెను ఉపయోగిస్తే బయట కొన్నట్లే పైన కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌గా ఉండే బజ్జీలను మీరు తయారు చేయవచ్చు. బండి మీద దొరికే కరకరలాడే మిర్చి బజ్జీని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా తయారు చేసుకోవడం చాలా సులభం. పిండి కలిపే విధానంలో చిన్న మార్పులు చేస్తే హోటల్ రుచిని మనం పొందవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* బజ్జీల కోసం: పెద్ద మిరపకాయలు (బజ్జీ మిర్చి),
శనగపిండి (1 కప్పు),
బియ్యం పిండి (1 టేబుల్ స్పూన్),
పసుపు,
కారం,
ఉప్పు,
వంట సోడా,
వాము,
వేడి నూనె (2 టీస్పూన్లు).
* స్టఫింగ్ కోసం: ఉప్పు, వాము, ధనియాల పొడి.
* గార్నిష్ కోసం: ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
తయారీ విధానం:
పిండిని సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కొంచెం పసుపు, కారం, చిటికెడు వంట సోడా వేయాలి. ఇందులోనే కొంచెం వామును నలిపి వేయాలి. వీటన్నింటిని జల్లెడ పట్టడం వల్ల పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్‌గా వస్తుంది. తర్వాత ఇందులో రెండు చెంచాల వేడి నూనెను వేసి, తగినన్ని నీళ్లు పోస్తూ దోశ పిండి కంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలి.
మిర్చిని సిద్ధం చేయడం:
బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. మిరపకాయలను మధ్యలోకి చాకుతో కట్ చేసి, అందులో ఉన్న గింజలు కావాలంటే తీసేయవచ్చు. ఇప్పుడు ఉప్పు, వాము, ధనియాల పొడి కలిపిన మిశ్రమాన్ని మిర్చి మధ్యలో స్టఫ్ చేయాలి.
బజ్జీలు వేయడం:
కడాయిలో నూనె పోసి మీడియం వేడి మీద ఉంచాలి. సిద్ధం చేసుకున్న మిర్చిని పిండిలో ముంచి, నూనెలో జాగ్రత్తగా వేయాలి. బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చి, పైన క్రిస్పీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్‌పై వేయించుకోవాలి.
సర్వింగ్:
వేగిన బజ్జీలను ప్లేట్‌లోకి తీసుకుని, మధ్యలోకి కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం కారం, నిమ్మరసం చల్లితే ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!