NTV Telugu Site icon

Mirai : “మిరాయ్” 3D ఫార్మాట్ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..?

Mirai (1)

Mirai (1)

Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన ”హనుమాన్” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.తేజ సజ్జ కెరీర్ లోనే హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తేజ సజ్జ మరో సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ తన తరువాత సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మేకర్స్ ‘మిరాయ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అలాగే ఈ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్సె వీడియోను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Read Also :Kajal Aggarwal : ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నా .. అందుకే ‘సత్యభామ’ లో నటించా..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు.తాజాగా మనోజ్ బర్త్ డే సందర్భంగా మనోజ్ పాత్రకు సంబంధించి గ్లింప్సె ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ డల్లాస్ లో ఈ మూవీ టైటిల్ గ్లింప్సె ని 3D ఫార్మట్ లో జూన్ 1వ తేదీన అలెన్ ఈవెంట్ సెంటర్‌లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 18, 2025న 2D మరియు 3D ఫార్మట్ లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాతో తేజ సజ్జ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Show comments