Site icon NTV Telugu

Mint leaves Farming : పుదీనా సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Mint

Mint

వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే పుదీనాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. సారవంతమైన నేలలు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రునేలల్లో పుదీనాను సాగు చెయ్యొచ్చు.. అయితే ఈ పుదీనాను రెండు పద్దతుల ద్వారా సాగు చెయ్యొచ్చు.. ఎలాగైనా కూడా మంచి లాభాలను పొందవచ్చు… ఈ పంట గురించి మరిన్ని వివరాలు..

ఒకటి కాండం ను మొక్కలుగా నాటుకోవటం, రెండు విత్తనాలను వేయటం ద్వారా సాగు చేయవచ్చు. నవంబరు నుండి డిసెంబరు మసాల్లో పుదీనా సాగుకు చల్లవాతావరణం అనుకూలం.. పంటకు అనుకూలంగా ఉంటుంది. స్వల్పకాల వ్యవధిలో అధిక అదాయాన్ని ఇచ్చే పంటగా పుదీనా ప్రసిద్ధి చెందింది. చాలా మంది రైతులు పుదీనా సాగు చేపట్టి అధిక అదాయాన్ని ఆర్జిస్తున్నారు. షెడ్ నెట్ విధానంలో సైతం పుదీనాను సాగు చేయవచ్చు. ఒక అర ఎకరం లో సాగు చెయ్యడానికి పది వేలు ఖర్చు అయితే మీకు 30 నుంచి 40 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు..

ఈ మొక్కలు నాటిన తర్వాత 25 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను ఎరివేయాలి. మొక్కలు పెరుగుతున్న దశలో కలుపు ను నివారించటం ఇబ్బందిగా మారుతుంది. అలాగే ఒక కూత పూర్తయిన తరువాత తిరిగి కలుపు నివారణ చేపట్టాలి. పుదీనా వేర్లే నేలపై భాగంలోనే పరచుకుని ఉంటాయి.. వేసవిలో నాలుగు రోజులకు ఒకరోజు నీటిని ఇవ్వాలి.. అదే చలికాలంలో అయితే 12 రోజులకు ఒకసారి నీరు అందించాల్సి ఉంటుంది.. ఈ పంటకు పశువుల ఎరువును అందిస్తే మంచిది.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు..

Exit mobile version