Site icon NTV Telugu

Pawan Kaalyan: డిప్యూటీ సీఎం పర్యటనలో అపశృతి.. తోపులాటలో మహిళ కాలిపై వెళ్లిన వాహనం

Pawan Kalayan

Pawan Kalayan

Pawan Kaalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలోని ముసలి మడుగు ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో పర్యటన ముగించుకుని, తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రిని దగ్గరగా చూడడానికి భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఒక మహిళ కిందపడింది. సరిగ్గా అదే సమయంలో కదలడానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ సంబంధించిన వాహనం కిందపడిన మహిళ కాలిపై నుంచి వెళ్లింది.

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్

దీనితో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అక్కడున్న సహాయక సిబ్బంది ఆ మహిళను వెనక్కి లాగి రక్షించారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కాలికి అయిన గాయాల తీవ్రత గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Jubilee Hills Bypoll: డ్రోన్లతో పర్యవేక్షణ, క్రిటికల్ కేంద్రాల వద్ద పారామిలిటరీ.. జూబ్లీహిల్స్ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Exit mobile version