Site icon NTV Telugu

Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!

Prostitution Racket

Prostitution Racket

Prostitution Racket: హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. భారతదేశం చూపిస్తామంటూ మాయచేసి బంగ్లాదేశ్ యువతిని అక్రమంగా హైదరాబాద్‌కి స్నేహితురాలు తీసుకవచ్చింది. ఆ తర్వాత మెహదీపట్నంలో ఉంటున్న షహనాజ్, హజీరా అనే మహిళలతో పాటు ఆటోడ్రైవర్ సమీర్ యువతిని వ్యభిచారంలోకి నెట్టారు. ఆ తర్వాత సదరు మైనర్ బాలికను ఆరు నెలల పాటు హోటళ్లలో పాడు పనులకు ఇష్టానుసారం వాడేశారు. ఆ తర్వాత అటుగా వెళ్తూ పోలీస్ స్టేషన్ బోర్డ్ గమనించింది సదరు బాలిక.

Tribals Attack: అటవీ అధికారులపై రెచ్చిపోయిన గిరిజనులు.. కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి!

దీనితో బండ్లగూడ పోలీస్ స్టేషన్ బోర్డు చూసి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన బాధితురాలు బాలిక.. తనకు జరిగిన విషయం మొత్తం బయటపెట్టింది. దీనితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బండ్లగూడ పోలీసులు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్ కి చెందిన ఇద్దరు ఆర్గనైజర్లను, ఇద్దరు మహారాష్ట్రకి చెందిన మహిళలు, మరొక మహిళ కోల్కతా చెందిన మహిళలను అదుపులోకి తీస్కున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ కి చెందిన మైనర్ అమ్మాయి వ్యభిచార ముఠాకు బలి అయ్యింది.

CM Chandrababu: నేడు అల్లూరి జిల్లా సీఎం చంద్రబాబు పర్యటన.. గిరిజనులతో మాట ముచ్చట..

Exit mobile version