NTV Telugu Site icon

Uttam Kumar Reddy: దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది..

Uttam

Uttam

నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన చిన్నదే.. నష్టం కూడా తక్కువేనని తెలిపారు. నష్టం కాంట్రాక్టర్ భరిస్తారు..
ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి కాలేదు.. నిర్మాణంలో లేదన్నారు.

Stock market: మార్కెట్‌లో జోష్.. లాభాల్లో ముగిసిన అన్ని రంగాల సూచీలు

నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు నిర్మాణం ఆలస్యం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం SLBC పూర్తి చేయలేదని.. SLBC ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాకుండా.. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ఎందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సుంకిశాల అన్ని పనులు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసింది.. వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. వాటర్ వర్క్స్ వాళ్ళు విచారణ చేస్తున్నారని చెప్పారు. సీఎం వచ్చిన తరువాత వారితో చర్చించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం బిజీబిజీ.. అడోబ్ సిస్టమ్స్ సీఈవోతో భేటీ

మరోవైపు.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా.. కృష్ణా నదిపై ప్రాజెక్టు పనులు జరగలేదని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్ కే తెలియాలని ఆరోపించారు. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు సుంకిశాల అవసరం లేదని అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని విమర్శించారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదని.. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేయడం సరికాదని గుత్తా పేర్కొన్నారు.

Show comments