చేవెళ్లలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో బీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు అందించే బీసీ బందు కార్యక్రమాన్ని మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రులు మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చెక్కులను పంపిణీ చేసారు.
Read Also: TS DSC : 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి..
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోరే పార్టీగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: ఏపీలో కంచుకోట లేమి లేవు.. రాష్ట్రమంతా సీఎం జగన్ కంచుకోటే..
తొలి విడత ప్రతిగా రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 300 చొప్పున.. రంగారెడ్డి జిల్లాలో 2100 మంది లబ్ధిదారులకు 21 కోట్లతో పథకం వర్తిస్తుందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు మూడు కోట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ జరగని విధంగా పథకాలను అమలుపరుస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి పథకం నిరంతర ప్రక్రియగా సాగుతాయని.. ఎవరు రాలేదని అసంతృప్తికి గురికారాదని, అందరికీ అర్హతలను బట్టి అందుతాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు.