KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది. మంత్రి సీతక్క ఇప్పటికే పలు రాజకీయ, సామాజిక వర్గాల నేతలను కలిసి మేడారం జాతరకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. అదే క్రమంలో నేడు కేసీఆర్‌ను కలిసి అధికారికంగా మేడారం ఆహ్వాన పత్రికను అందజేయనున్నట్లు తెలిపారు. మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
READ MORE: TOXIC : యష్ బర్త్ డే స్పెషల్.. టాక్సిక్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్.. కొంచం యాక్షన్.. మరికొంత ఓవరాక్షన్
