Site icon NTV Telugu

Joint Staff Council Meeting: సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చలు..

Ap Empolyess

Ap Empolyess

అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. పెండింగ్ డీఏ, ఏపీజీఎల్ఐ, ఐఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పరిష్కారం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది.

Read Also: Manish Sisodia: మనీష్‌ సిసోడియాకు 3 రోజుల పాటు మధ్యంతర బెయిల్

ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నేతల్లో ఏపీజేఈసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ఏపీటీఎఫ్, యుటిఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు.

Read Also: Rivaba: మామ ఆరోపణలు.. సీరియస్ అయిన రవీంద్ర జడేజా సతీమణి

Exit mobile version