Vivek Venkatswamy: తెలంగాణలోని గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణతో పాటు వారికి సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాజాగా సచివాలయంలో అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన బిల్లును ఈ నెల 12న జరగబోయే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. శాసనసభ ఆమోదం పొందిన వెంటనే ఈ చట్టం అమల్లోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Arundhati Reddy: అతడి వల్లే వన్డే వరల్డ్ కప్‌ను గెలిచాం.. అరుంధతి రెడ్డి ఆసక్తికర విషయాలు!
అదేవిధంగా, బిల్లులో గిగ్ వర్కర్లకు మరింత మేలు చేకూరే మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తుందని తెలిపారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాల అమలుపై ప్రస్తుతం సమీక్ష జరుగుతోందని, ఈ విషయమై అగ్రిగేటర్లతో చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వివేక్ వెల్లడించారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక చట్టం ద్వారా రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు మెరుగైన భద్రత, ఆర్థిక స్థిరత్వం లభించనుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Trump-Modi: మోడీపై మరోసారి ట్రంప్ ప్రశంసలు.. భారత్‌లో పర్యటనపై హింట్
