Site icon NTV Telugu

Minister Vidadala Rajini: ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ.. త్వరలోనే 17 మెడికల్‌ కాలేజీ వస్తాయి..

Vidadala Rajini

Vidadala Rajini

Minister Vidadala Rajini: త్వరలోనే ఏపీలో 17 మెడికల్‌ కాలేజీలు వస్తాయని తెలిపారు మంత్రి విడదల రజిని.. ఇప్పటికే రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. త్వరలో 17 మెడికల్ కాలేజీలు రానున్నాయని తెలిపారు.. ప్రతీ పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నదే టార్గెట్‌ అన్నారు.. విజయనగరం, నంధ్యాల, ఏలూరు, రాజమండ్రి మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు కూడా వచ్చాయని తెలిపారు ఇక, 750 ఎంబీబీఎస్‌ సీట్లకు అడ్మిషన్లు త్వరలో చేపట్టనున్నట్టు వెల్లడించారు..

Read Also: Adimulapu Suresh: పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం లక్ష్యం..

విజయవాడలో అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది.. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్ళ సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ.. వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.. వైద్య సేవలు ఇంకా మెరుగ్గా చేయడానికే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నారు.. కోవిడ్ కాలంలో అద్భుతమైన వైద్య సేవలు అందించారని ప్రశంసలు కురిపించారు. రోగి సంతృప్తి చెందితే మన జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఆయన.. 3,255 ప్రొసీజర్ల వరకూ పెంచి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేస్తున్నామని వెల్లడించారు. జీరో వేకెన్సీ పాలసీతో నియామకాలు చేస్తున్నారు సీఎం జగన్.. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులలో సేవలు పెరిగాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజలకు చాలా ఉపయోగకరంగా చేస్తున్నామని వెల్లడించారు మంత్రి విడదల రజని.

Exit mobile version