ఏపీ కేబినెట్లో త్వరలో మార్పులు తప్పవంటూ వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు మంత్రి వేణుగోపాల కృష్ణ. క్యాబినెట్ లో మార్పులు అన్నది మీడియా ఊహ అని ఆయన అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గతంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోనే విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారు. పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ఉన్నపళంగా ఎందుకు వెళ్ళి పోయారో అర్థం కాలేదన్నారు.
Read Also: Fire At Simhachalam: సింహాద్రి అప్పన్నకొండల్లో కార్చిచ్చు
రాజకీయ పరిణతి కోల్పోయినట్లు కనిపిస్తోంది. పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబే. పవన్ కళ్యాణ్ కు వాస్తవాలు తెలియవు. తెలంగాణలో 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తీసేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎంకు ఈ అంశం పై లేఖ రాశారన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.
