సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో రేషన్ షాపును పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి బియ్యం, ఇతర సేవల నాణ్యతను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే రైస్ మిల్లర్లుపై తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించినా, దుర్వినియోగం చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Visakhapatnam Port: విశాఖపట్నం పోర్టులో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు
దాదాపు 70 నుంచి 75 శాతం రేషన్ బియ్యాన్ని మిల్లర్లు, ఇతర అసాంఘిక సంస్థలు రీసైకిల్ చేస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బియ్యం రీసైక్లింగ్ చేయడంలో ఎంత పెద్ద వారి ప్రమేయం ఉన్నా చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై దాదాపు 56,000 కోట్ల రూపాయల భారీ అప్పుల భారం మోపింది.. కర్ణాటక, తమిళనాడుకు బియ్యం విక్రయాలను పరిశీలిస్తున్నామన్నారు.