అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణపై నిబద్ధతతో ఉన్నామని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు చేసిన ఘనత తమ సీఎం, ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. బీసీ కుల గణన లెక్కలు తప్పు అంటున్నారు.. ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. 1931 తర్వాత.. ఇప్పుడు తాము చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజ్వేషన్లను ఇవ్వాలని నిర్ణయించింది కూడా తామేనని అన్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. సమగ్ర సర్వే చేసి సభలో పెట్టేంత ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు. పబ్లిక్ డొమైన్‌లో కూడా పెట్టలేదు.. మీరు బీసీలకు వ్యతిరేకం అందుకే పట్టించుకోలేదు.. మీ సర్వే పబ్లిక్ డొమైన్‌లోనే పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంఖ్య 6 శాతం పెరిగింది.. మీరు సర్వే చేశాం అని చెప్తున్న దాంట్లో కంటే బీసీ సంఖ్య పెరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.. సర్వేలో మీరే పాల్గొనలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఇంకా ఎవరైనా సర్వేలో పాల్గొనక పోతే మళ్ళీ గడువు ఇచ్చామని అన్నారు.
Read Also: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. తిరుమలలో విచారణ కమిటీ ఆరా..
పులిచింతల ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుసు.. పులిచింతలతో తెలంగాణకి నష్టం లేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణా నది ఆయకట్టు నుండి ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచానన్నారు. కృష్ణా జలాల్లో 812 టీఎంసీలో ఏపీకి 512 టిఎంసీలు ఇచ్చింది కేసీఆర్, హరీష్ అని దుయ్యబట్టారు. తాము వచ్చాక కృష్ణా నీటి వాట పంపకాల అంశం ఓపెన్ చేశామని తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం టెలిమెట్రిక్ మిషన్ కూడా పెట్టలేక పోయారు.. బీర్ఎస్ హయంలో కృష్ణానది జలాలను తరలించడానికి ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి సరైన నీరు రావడానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Robinhood : నటుడిగా డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక బ్యాటింగే