NTV Telugu Site icon

Minister Uttam: మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి నివేదిక ఇస్తాం.. ఏం చేస్తాం అనేది ప్రకటన చేస్తాం

Uttam

Uttam

మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లోపాలన్ని మానవ తప్పిదాలేనని తెలిపారు. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. మేడిగడ్డ కుంగడంతో రెండో పంటకు సాగునీటిపై సందిగ్ధత ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నాం.. మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి రెండు.. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని అన్నారు. కాళేశ్వరంపై ఏం చేస్తాం అనేది.. ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇంత నాసిరకం నిర్మాణం ఎక్కడా చూడలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

Read Also: TS Inter Exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?

కాళేశ్వరం ప్రారంభం నుంచే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ తో పాటు.. ప్రాజెక్ట్ లొకేషన్ కూడా మార్చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డలో ఫిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయిందని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పిన కేసీఆర్.. అది కుంగితే ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. లక్ష కోట్లు అంతా మూడు బ్యారేజ్ లపైన ఉందని.. మూడు బ్యారేజ్ లలో డ్యామేజ్ లు వచ్చాయన్నారు మంత్రి ఉత్తమ్.

Read Also: AL Vijay: అమలా పాల్ మాజీ భర్తపై యువకుడు దాడి.. కారును ఆపి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఇచ్చింది స్వేద పత్రం కాదు.. సోది పత్రమని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళది దోపిడీ అని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగడం చిన్న విషయమే అయితే.. జనాలను ఎందుకు చూడనివ్వలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కీలకమైన అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ అన్నీ వృధా అని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఇంతకంటే స్టాండర్డ్ గా ఉందని తెలిపారు. మూడేళ్ళ ప్రాజెక్టు లాగా కాళేశ్వరం లేదు.. నాణ్యత లోపం ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.