జలసౌధలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ పనులు, అభివృద్ధి ప్రతిపాదనలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెండింగ్ అంశాలు ఎలా ముందుకు తీసుకుపోవాలి అని సమావేశంలో చర్చించామని తెలిపారు.
Read Also: KCR: బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు.. వరంగల్‌లో భారీ బహిరంగ సభ
ఇరిగేషన్ మంత్రిగా తమ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యలను విద్య, వైద్యం సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అందరి ముందుకు పోవాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జిల్లా మంత్రులుగా శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను వారి దృష్టికి తీసుకుపోతామని అన్నారు.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ వీధిలో ఆలయం..
గతంలో తెలంగాణ నినాదానికి పరిమితమైన కరీంనగర్.. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితమైన పరిస్థితి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. దానిని ప్రాక్టికల్‌గా ఆచరణలోకి తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి మార్గదర్శకత్వంగా.. జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోయి రైతులకు ఇతర రంగాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు జరుగుతాయని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులంగా జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.