Site icon NTV Telugu

Uttam Kumar Reddy : మేడిగడ్డ అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

Uttamkumar Reddy

Uttamkumar Reddy

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించిందన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చిందన్నారు. మేడిగడ్డలో జరిగిన పిల్లర్ల కుంగుబాటుపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత జ్యూడిషియల్ విచారణ జరుపుతామని ప్రకటించిన ప్రభుత్వం.. అందుకు క్యాబినెట్ సమావేశంలో తీర్మాణం చేసిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. సిట్టింగ్ జడ్జి విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారన్నారు. ఈ రోజు విజిలెన్స్ దాడులు నీటి పారుదల శాఖ కార్యాలయాలలో తనికీలతో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు.

 

ఇవాళ ఢిల్లీలో కేఆర్ఎంబీ(కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు) సమావేశం ఉంది. ఆ సమావేశానికి రాష్ట్రం నుంచి అధికారులు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయమే విజిలెన్స్ అధికారులు జలసౌధలోని రెండు, నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ ఎన్సీ ఆఫీసు, అనుబంధ కార్యాలయాల్లో తనిఖీలకు ఉపక్రమించింది. దీంతో ఈఎన్సీ మురళీధర్ రావుతోపాటు మిగతా అధికారులు ఆఫీసుల్లోనే ఉండిపోయారు. ఈఎన్సీగా మురళీధర్ రావు టర్మ్ లోనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం సాగింది. ఈ సమయంలో కొంత కాలం ఇరిగేషన్ కార్యదర్శిగా కొంత కాలం రజత్ కుమార్ వ్యవహరించారు. ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఆ బాధ్యతలను స్మితా సబర్వాల్ చూశారు. విజిలెన్స్ తనిఖీల్లో ఏం బయటపడుతుందోననే టెన్షన్ ఇరిగేషన్ అధికారుల్లో పట్టుకుంది.

 

Exit mobile version