NTV Telugu Site icon

Tummala Nageswara Rao: రైతులు ఆందోళన చెందొద్దు.. విత్తనాలు తగినంత ఉన్నాయి

Thummala

Thummala

రాష్ట్రంలో అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా విత్తన కంపెనీలతో ఫిబ్రవరి, మార్చి మాసంలో వరుస సమావేశాలు నిర్వహించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా.. ఈ వానా కాలానికి 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు కాగలదని అంచనా వేసి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకేట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేయడం జరిగిందని.. దానికనుగుణంగా ఈరోజు వరకు 51,40,405 పత్తి ప్యాకేట్లు వివిధ జిల్లాలలో రైతులకు అందుబాటులో ఉంచామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 10,39,040 వివిధ కంపెనీలకు చెందిన ప్యాకేట్లు రైతులు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.

HIT and RUN Accident: రోడ్డు దాటుతున్న వ్యక్తి పైకి దూసుకెళ్లిన థార్ కారు.. వ్యక్తి మృతి..

ప్రతిరోజు అన్ని జిల్లాలల నుండి కంపెనీ వారీగా.. రకాల వారీగా అందుబాటులో ఉంచిన పత్తి ప్యాకేట్ల వివరాలు.. అదే విధంగా రైతులు కొనుగోలు చేసిన వివరాలను తెప్పించుకొని వ్యవసాయ శాఖ వారు నిరంతరం పర్యవేక్షించే విధంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గత రెండు మూడు రోజులుగా ఒకటి, రెండు జిల్లాలలో పత్తి ప్యాకేట్లు దొరకలేదని రైతులకు కొరత వలన కేవలం రెండు పత్తి ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని వివిధ పత్రికలలో వార్తలు వచ్చాయన్నారు. ఆయా జిల్లాలలో కొన్ని ప్రాంతాల రైతులు ఒక్కటే కంపెనీకి చెందిన ఒకటే రకం పత్తి విత్తనాల కోసం అడగడంతో ఆ రకం విత్తనాలు రైతులు అడిగిన డిమాండ్ మేరకు లేక రైతులందరికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఒక్కొక్కరికి వరుసలో నిల్చోబెట్టి ఆ రకంకు చెందిన పత్తి విత్తన ప్యాకేట్లు రెండు ఇచ్చినట్లు తెలిపారు. అంతేగాని ఆ మార్కెట్లలో గాని, ఆ జిల్లాలలో గాని పత్తి విత్తన ప్యాకేట్లలో ఎటువంటి కొరత లేదని తెలియజేశారు. రైతులను వరుసగా ఉంచే సందర్భంలో వారి మీద లాఠి ఛార్జి జరిగిందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేయడం రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.

Putin: పుతిన్‌ని ఎలుగుబంటి నుంచి రక్షించిన వ్యక్తికి అత్యున్నత పదవి..

వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెప్పినట్లు మేలైన యాజమాన్య పద్దతులు పాటిస్తే అన్ని రకాల పత్తి హైబ్రిడ్ లు అటుఇటుగా ఒకేరకంగా దిగుబడి ఇస్తాయని మంత్రి తుమ్మల చెప్పారు. కేవలం ఒకటే కంపెనీ, ఒకటే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న గత సంవత్సరాలలో మంచి దిగుబడులు ఇచ్చిన రకాలను కూడా కొనుగోలు చేయాలని తెలిపారు. 2023 వానాకాలంలో రూ. 66.81 కోట్ల సబ్సిడీ విలువతో 1.27 లక్షల క్వింటాళ్ళ పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేశామని.. గత సంవత్సరం ఈ రోజు వరకు కేవలం 24,898 క్వింటాళ్ళు మాత్రమే రైతులకు అందజేశారని, 2024 వానాకాలంలో 109.15 కోట్ల సబ్సిడి విలువతో 1.95 లక్షల క్వింటాళ్ళ పచ్చిరొట్ట విత్తనాన్ని పంపిణీ చేయాలని ప్రతిపాదించి, ఇప్పటివరకు 79,261 క్వింటాళ్ళు పంపిణీ చేశామన్నారు. అందులో 54,162 క్వింటాళ్ళు రైతులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 29,000 క్వింటాళ్ళు ఈపాటికే అధికంగా రైతులకు అందించగలిగామని మంత్రి పేర్కొన్నారు.