Site icon NTV Telugu

Tummala Nageswara Rao : రుణమాఫీకి 2018లో అవలంబించిన విధానాలే 2024 లో కుడా అమలు

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే 2024 లో కూడా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అప్పుడు 2018 రుణ మాఫీ క్రింద 20 వేల కోట్లు ప్రకటించి , 2023 ఎన్నికల సంవత్సరలో 13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో 1400 కోట్లు వెనక్కి వచ్చిన కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకుల ముందుకి వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు. రుణ మాఫీ పధకంలో రేషన్ కార్డ్ కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికము మాత్రమే అని, మా ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు చేశారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో 2లక్షల రుణ మాఫీ చేస్తుంటే హర్షించాల్సిన గత ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక మంత్రులు, ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నించడం చూస్తున్న తెలంగాణ సమాజం ముఖ్యంగా రైతాంగం వీరిని తప్పక అసహ్యించు కొంటారని మంత్రి తుమ్మల అన్నారు.

 

Exit mobile version