NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : మునుగోడులో టీఆర్‌ఎస్‌ మంచి మెజారిటీతో గెలుస్తుంది

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

మనుగోడు ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మునుగోడు ఉప ఎన్నిక వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, మునుగోడు ఎన్నికలు ఒక వ్యక్తికి మదం పట్టడం వల్ల వచ్చాయన్నారు. అంతేకాకుండా.. గడిచిన ముడున్నరెళ్ళలో రాజ గోపాల్ రెడ్డి ప్రజల్లో లేరని స్థానికులే చెబుతున్నారు. మునుగోడుకు 1000 కోట్లు తెస్తానంటున్న రాజ గోపాల్ రెడ్డి, దుబ్బాక, హుజూరాబాద్ లలో గెలిచిన వాళ్ళు ఎందుకు తేలేదు.

Also Read : Constable Recruitment : పరీక్షలో కాపీ కొట్టడానికి ఏకంగా బ్లూటూత్ తో వచ్చేశారా.. వామ్మో..

భారత దేశ పటంలో మునుగోడు ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత కేసీఆర్ ది. బీజేపీ వాళ్లు ఏక వచనంతో తిట్టడం, అరవడం చేస్తున్నారు. ఎంతో అభివృద్ది జరిగినా అక్కడక్కడ సమస్యలు ఉంటాయి. చేత కాక పారిపోయిన రాజగోపాల్ రెడ్డి కి చమర గీతం పాడతారు. బీజేపి కార్పొరేటర్ వద్ద కోటి రూపాయలు దొరికాయంటే అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యవస్థ మీద అధికారం చెలాయిస్తుంది. గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా కారును పోలిన గుర్తుపై ఫైట్ చేస్తాం. మునుగోడులో టీఆర్ఎస్ మంచి మెజారిటీతో గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.