Site icon NTV Telugu

Sridhar Babu: గ్లోబల్ సిటీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది..

Sridhar Babu

Sridhar Babu

Sridhar Babu: తెలంగాణ సెక్రటేరియట్‌లో శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక అరచకత్వానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూస్తూ పని చేస్తున్నామని అన్నారు. కొన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు క్యాబినెట్ నిర్ణయాలపై కేటీఆర్ అనేక విమర్శలు చేశారని, ఆయన ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. గ్లోబల్ సిటీ చేయాలని చేస్తున్న ఆలోచనలను బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తుందని అన్నారు.

READ ALSO: Vijay TVK: టీవీకే అధినేత విజయ్‌కి షాక్.. ప్రచారానికి నో చెప్పిన పోలీసులు !

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టానుసారంగా అడ్డగోలుగా చేయదని, ప్రభుత్వ అనుమతులు లేకుండా చెల్లింపులు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీలో భాగంగా సంక్షేమం ఉంటుందని అన్నారు. పారిశ్రామిక వాడల భూముల విషయంలో సత్యదూరమైన 9202 ఎకరాల భూమి గురించి మంత్రి మాట్లాడుతూ.. 4740 ప్లాటెడ్ ఏరియా అని కేటీఆర్ చెప్పారని, ఇందులోనే ఆయన డొల్లతనం బయట పడిందని అన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వంలో మూడు జీవోలు తెచ్చారని, లీజ్ ల్యాండ్స్ ఉంటాయని, పరిశ్రమలను ప్రోత్సాహించేందుకు అవి వినియోగిస్తారని, ఫ్రీ హోల్డ్ ల్యాండ్‌గా గుర్తిస్తారని చెప్పారు. 2023లో మూడు జీవోలు ఇచ్చారు. అజమాబాద్, బాలానగర్, హాఫీజ్‌పెట్ ఇండస్ర్టీయల్ లీజ్ ల్యాండ్స్‌ను ఫ్రీ హోల్డ్ చేయాలని చూశారని అన్నారు.

మేము తెచ్చే పాలసీ ప్రకారం ఆ ల్యాండ్స్ ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ కాదని, భూమిపై సర్వ హక్కులు ఉంటాయో ఈ భూముల వారి స్వాధీనంలో ఉంటాయని మంత్రి వెల్లడించారు. అవుట్ రింగ్ రోడ్డులో ఉంటున్న అన్ని పరిశ్రమలను రిలోకేట్ చేస్తామని అన్నారు. పరిశ్రమలు నడపలేని వారు, సిక్ అయిన పరిశ్రమలు ఉన్నాయి. పాత టెక్నాలజీ తో ఉండి ఉత్పత్తి చేయలేని పరిశ్రమలు కూడా ఉన్నాయి. టిజిఐఐసికి సంబంధించిన పరిశ్రమలు ఔటర్ బయటకు పంపిస్తామని అన్నారు. దానికి 30 శాతం కన్వర్షన్ ఫీజు క్యాబినెట్ సూచించింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు. ఇందులో టీజీఐఐసి, హెచ్ఎండీఏ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, ఈ నూతన పాలసీ ఇండస్ట్రీయల్ కామర్స్ శాఖ రూపొందిస్తుందని వెల్లడించారు.

గత ప్రభుత్వం ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక గ్రిడ్ పాలసీ తెచ్చింది. వారు అప్పుడు చేసిన పనులన్నీ బయటకు తీయాల్సి ఉంది, అప్పుడు కన్వర్షన్ ఫీజు తీసుకుని పాలసీ తెచ్చారు.. మరి ఇందులో ఎన్ని లక్షల కోట్ల మతలబు ఉందో కేటీఆర్ చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర గౌరవం గురించి ఆలోచించి భయాందోళనలు సృష్టించ లేదని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆదాయ వనరులకు గండి పెట్టాలని బీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. పరిశ్రమలు కావాల్సిన వారు ఫీజు కట్టుకుంటారని, ఆధారాలు ఉంటే మాట్లాడాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు.

READ ALSO: AP 10th Exams Dates: ఏపీ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్ విడుదల!

Exit mobile version