Minister Sridhar Babu: తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను పరిశీలన చేయడానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఫ్యూచర్ సిటీ (Future City) లోని సమ్మిట్ వేదికను సందర్శించారు. వేదిక ప్రాంగణంలోనే మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
BYD Yangwang U8: క్వాలిటీ చెక్ అంతే ఇది గురూ.. కారుపై మూడు సార్లు పడ్డ తాటి చెట్టు.. అయినా..?
సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల పనులను డిసెంబర్ 5వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డిసెంబర్ 6వ తేదీన ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా డ్రై రన్ (Dry Run) కండక్ట్ చేయాలని సూచించారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలని, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Kane Williamson Return: లాంగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ.. చరిత్ర సృష్టించిన కేన్ మామ!
అలాగే విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై మంత్రి సమీక్షించారు. ముఖ్యంగా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్ లకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్, లాజిస్టిక్స్, ఆతిథ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా సమ్మిట్ విజయవంతం కావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో స్పష్టమవుతోంది.
