జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్ పై సీరియస్ గా ఉన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మర్డర్ ఎవరు చేసినా.. ఎవరు చేయించినా వదిలేది లేదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీతో ఇప్పటికే మాట్లాడినట్లు తెలిపారు. జీవన్ రెడ్డితో తాను కూడా మాట్లాడతానన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత అని.. ఆయన సేవలను తాము వినియోగించుకుంటామన్నారు. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించమని తెలిపారు. చనిపోయిన బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
READ MORE: PAC-SEBI: రేపు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్మన్ మాధబి
ఇదిలా ఉండగా.. నిన్న (అక్టోబర్02)న జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టారని.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలిసింది. దీంతో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు.
READ MORE:Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితి..