Site icon NTV Telugu

Sridhar Babu: మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ హడావుడి చేసింది.. కానీ.. చేసిందేం లేదు

Sridhar Babu

Sridhar Babu

మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా… ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలి. డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది. కానీ.. చేసిందేం లేదు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరి కాదు. ప్రతి దానిని రాజకీయం చేయొద్దు. ఇది మన బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని గుర్తించాలని సూచించారు.

Also Read:Seema Haider: ట్రెండింగ్‌గా మారిన సీమా హైదర్.. విశేషమేంటంటే…!

హైదరాబాద్ నగర వాసులకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను కల్పించాలన్నదే మా సంకల్పం. స్వచ్ఛమైన గాలి, నీటిని అందించేందుకే మా ఈ ప్రయత్నం. మూసీ పునర్జీవనమే మా లక్ష్యం. మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా మూసీ ప్రక్షాళనను దశల వారీగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం. మూసీ ప్రక్షాళన పనుల్లో ఎలాంటి జాప్యం లేదు. డీపీఆర్ సిద్ధం అవుతోంది. మొదటి దశలో బాపుఘాట్ దగ్గర “గాంధీ సరోవర్ ప్రాజెక్ట్” పేరిట పనులు చేపడతాం. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందని తెలిపారు.

Also Read:Warangal: మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు..

మూసీ ప్రక్షాళనను అత్యంత ప్రణాళికాబద్ధంగా చేపడతాం. కన్సల్టెన్సీ నుంచి నివేదిక అందిన తర్వాత రెండో దశ, మూడో దశ పనులపై నిపుణులను భాగస్వామ్యం చేసి నిర్ణయం తీసుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదలకు ఇబ్బంది కలగకుండా వారిని ఒప్పించి.. అపోహలను తొలగించి.. వారికి ప్రత్యామ్నాయం చూపించే మూసీ ప్రక్షాళన చేపడతాం. నమో గంగే, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.

Also Read:Hyderabad: సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులకు వల.. మహిళ అరెస్ట్

గోదావరి నది నుంచి 2.5 టీఎంసీ నీటిని మూసీకి తరలించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. కానీ… కేంద్రం స్పందించడం లేదు. నిధుల కేటాయింపులో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుంది. తెలంగాణ కూడా ఈ దేశంలోనే భాగమని గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు చొరవ చూపి… ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం నిధులు కేటాయించేలా చొరవ చూపాలని కోరుతున్నా. మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్ రూం ఇస్తాం. ఇప్పటికే 309 మందికి ఇచ్చాం. ప్రతిపక్షాలు వస్తే ఎక్కడ… ఎవరెవరికి ఇచ్చామో చూపిస్తాం. మూసీ ప్రక్షాళనలో ఉపాధి కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుంది. చట్ట ప్రకారం నష్ట పరిహారం అందజేస్తాం. ఎవరికీ అన్యాయం జరగదు అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Exit mobile version