NTV Telugu Site icon

Minister Seethakka: కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

Seethakka

Seethakka

Minister Seethakka: ఆదివారం కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కావలసిన నిధులు ఎక్కడ ఆగకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడిని ఉపయోగిస్తామని ఆవిడ చెప్పుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాలని ఆవిడ తెలియజేశారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్ మృతి తనకి తీవ్ర ఆవేదనను కలగజేసిందని తెలిపింది. అలాగే తనకి అత్యంత సన్నితుడిగా ఉండే రమేష్ రాథోడ్ మృతి తనను కలిసివేసిందంటూ ఆవిడ పేర్కొంది.

Rachamallu Siva Prasad Reddy: మేము ఓడినా.. ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తాం

రమేష్ రాథోడ్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేసింది సీతక్క. ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు తాగునీరు అందిస్తామని అందుకు సంబంధించిన నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ వ్యవసాయశాఖ మార్కెట్లో మిషన్ భగీరథ వాటర్ సప్లై ని ప్రారంభించారు. నల్లాల ద్వారా నీటిని ఆవిడ ఇళ్లకు పంపిణీ చేశారు.

Vegetable Juice : శరీరంలోని కొవ్వును తగ్గించాలంటే ఈ వెజిటేబుల్ జ్యూస్ తాగాల్సిందే..