NTV Telugu Site icon

Singireddy Niranjan Reddy : 8 ఏళ్లల్లో కేసీఆర్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు

Singireddy Niranjanreddy

Singireddy Niranjanreddy

Minister Singireddy Niranjan Reddy Fired on BJP.

మెదక్ జిల్లా కేంద్రంలో నూతన రేక్ పాయింట్‌ను మంత్రి హరీష్‌రావుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం కోసం తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ రైల్వే లైన్ తెలేదు.. కానీ కేసీఆర్ మెదక్ కి రైల్వే లైన్ తెచ్చారన్నారు. ప్రధాని రాష్ట్రం గుజరాత్ లో ఎక్కడ మన లాగా కరెంట్ లేదు, రైతులకు పెట్టుబడి ఇచ్చుడు లేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లల్లో అద్భుతాలు చేసి చూపించారు కేసీఆర్ అని ఆయన కొనియాడారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపాలని బీజేపీ అంటుందని, కేంద్రాన్ని ఏలే బీజేపీ స్వతంత్ర ఉద్యమంలో ఏనాడు లేదని ఆయన విమర్శించారు.

 

సమగ్ర వ్యవసాయ భీమా ఎందుకు తేలేదు.. ఇది యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన విఫల ప్రయోగమని, ఈ పథకం గుజరాత్ లో లేదు.. కానీ తెలంగాణలో పెట్టాలట అంటూ ఎద్దేవా చేశారు. రైతుల మీద మీకు ప్రేమ ఉంటే సమగ్ర వ్యవసాయ పాలసీ తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉచితాలు అవసరం లేదు అని ప్రధాని అన్నారని, రైతులకు కరెంట్ ఉచితంగా ఇవ్వొద్దు అన్నాడని, మీరు ఉచితంగా కార్పొరేట్లకు కోట్లు తగలబెట్టలేదా అని ఆయన మండిపడ్డారు.