Minister Seethakka: యూరియా కొరత పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై ధర్నా చేయిస్తున్నారని విమర్శించారు. నేడు కామారెడ్డిలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.. బీవీపేట, దోమకొండ, భిక్కనూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే.. కావాలనే యూరియాను సరఫరా చేయడం లేదని ఆరోపించారు. రైతులను పట్టించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ బతుకుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పబ్లిక్ లో నుంచి వచ్చారని… ఫార్మ్ హౌస్ లో నుంచి అమెరికా నుంచి వచ్చిన వారు కాదన్నారు. ఈనెల 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. బీసీ బిల్లు ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
READ MORE: Israel: ‘‘అమెరికా ఏం చేసిందో మేము అదే చేశాం’’.. ఖతార్ దాడులపై ఇజ్రాయిల్..
మరోవైపు.. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. రైతు వేదికల ఎదుట యూరియా టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేస్తున్నారు.
READ MORE: Andhra Pradesh : ఏపీ రాజకీయాల్లో వైద్య కళాశాలలపై మాటల యుద్ధం.. చంద్రబాబు వర్సెస్ జగన్
