NTV Telugu Site icon

Seethakka: మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం..

Seethakka

Seethakka

మహిళలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో ఆమె మాట్లాడుతూ.. మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అన్న మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘానికి వడ్డీలేని రుణాన్ని ఇచ్చి.. ప్రతి మహిళను కోటీశ్వరులను చేయడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అని సీతక్క తెలిపారు.

Kolkata: సా.5గంటలకు చర్చలకు రావాలని డాక్లర్లకు ప్రభుత్వం పిలుపు.. భేటీపై ఉత్కంఠ!

కోట్ల రూపాయలతో ములుగులో రోడ్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామని, సాంక్షన్ చేసామన్నారు. ఆ పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగులో వచ్చి పనిచేసే క్రాంట్రాక్టర్స్, అధికారులకు మంత్రి సీతక్క హెచ్చరిక జారీ చేశారు. అధికారులు, కాంట్రాక్టర్స్ పనులలో నాణ్యత లేకుంటే చేస్తే సహించేది లేదన్నారు. భవిష్యత్ లో వారికి పనులు ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. రామప్ప అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అలాగే.. మేడారంలో శాశ్వత నిర్మాణాలకు పంచాయతీ రాజ్, టూరిజం శాఖల నుండి నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు.

Hyderabad: తెలంగాణ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణుల ఆందోళన..