అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Zelensky: అమాంతం పెరిగిన జెలెన్ స్కీ ప్రజాదరణ.. ట్రంప్ ప్రధాన కారణం..
ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం.. పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని సీతక్క చెప్పారు. ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. 21 వేల కోట్లకు పైగా రుణాలిచ్చాం.. వడ్డీలు, చక్ర వడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: 10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ.. మహిళా సంఘంలో చేరడం వలన ఒక సామాజిక భద్రత ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే 60 ఏళ్లు దాటిన మహిళలకు మహిళా సంఘంలో చేర్చుకుంటున్నామన్నారు. మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదన గురైన సందర్భాలు ఉన్నాయి.. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కూడా మహిళా సంఘంలో సభ్యులుగా చేర్చుకునే అవకాశం కల్పించామని చెప్పారు. మహిళా సంఘం సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ లోన్ బీమా అందిస్తున్నామన్నారు. మహిళలు వంటగదికే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని సీతక్క తెలిపారు. అదానీ, అంబానీలకే పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి సోదరుడుగా అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళలు ఏ బిజినెస్ పెట్టుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సోదరుడుగా అండదండగా నిలబడి పనిచేస్తున్నారు.. మహిళలంతా ఈ ప్రభుత్వాన్ని దీవించండని మంత్రి సీతక్క పేర్కొన్నారు.