Seethakka: మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం..
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మహిళలందరికీ శుభ దినం మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయం ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ రోజు మహిళలందరికీ శుభ దినం అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
Read Also: Zelensky: అమాంతం పెరిగిన జెలెన్ స్కీ ప్రజాదరణ.. ట్రంప్ ప్రధాన కారణం..
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఫ్రీ ప్రయాణం నుంచి బస్సు ఓనర్లుగా మహిళలను మార్చాం.. పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని సీతక్క చెప్పారు. ఇందిరా శక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. 21 వేల కోట్లకు పైగా రుణాలిచ్చాం.. వడ్డీలు, చక్ర వడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Read Also: 10th Hall Tickets 2025: విద్యార్థులకు అందుబాటులో పదవ తరగతి హాల్ టికెట్స్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
మహిళా సంఘం అంటే ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ.. మహిళా సంఘంలో చేరడం వలన ఒక సామాజిక భద్రత ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే 60 ఏళ్లు దాటిన మహిళలకు మహిళా సంఘంలో చేర్చుకుంటున్నామన్నారు. మహిళలు చదువు మానేసి అనేక రకాల మానసిక వేదన గురైన సందర్భాలు ఉన్నాయి.. కాబట్టి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కూడా మహిళా సంఘంలో సభ్యులుగా చేర్చుకునే అవకాశం కల్పించామని చెప్పారు. మహిళా సంఘం సభ్యురాలుగా ఉండి ఏదైనా ప్రమాదంలో మృతి చెందితే వారికి 10 లక్షల ఇన్సూరెన్స్ లోన్ బీమా అందిస్తున్నామన్నారు. మహిళలు వంటగదికే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని సీతక్క తెలిపారు. అదానీ, అంబానీలకే పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి సోదరుడుగా అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళలు ఏ బిజినెస్ పెట్టుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక సోదరుడుగా అండదండగా నిలబడి పనిచేస్తున్నారు.. మహిళలంతా ఈ ప్రభుత్వాన్ని దీవించండని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..