Site icon NTV Telugu

Minister Seethakka : మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం

Seethakka

Seethakka

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు, నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. పైపులైన్లు పగిలిపోయిన లీకైన వెంటనే వాటిని సరిదిద్దు నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలి ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.

Adilabad Traffic: మోడీ పర్యటన.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయి అవసరాలను గమనించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని గౌరవ మంత్రివర్యులు సూచించారు. ఈ వేసవిలో తరచూ సమీక్షలు నిర్వహించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. చీఫ్ ఇంజనీరింగ్, సూపరింటెండింగ్ ఇంజనీర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. మండల స్థాయి మిషన్ భగీరథ ఇంజనీర్లు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు.

Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!

Exit mobile version